Friday 22 December 2017

hello movie review



చిత్రం పేరు : హలో 
చిత్రం విడుదల : 22.12.2017 
నటించిన వారు : అక్కినేని అఖిల్‌, కళ్యాణి ప్రియదర్శన్‌, అజయ్‌, జగపతిబాబు తదితరులు.... 
దర్శకత్వం వహించింది : విక్రమ్‌ కె.కుమార్‌ 
సంగీతదర్శకుడు : అనూఫ్‌ రూబెన్స్‌ 
చిత్ర నిర్మాత : నాగార్జున అక్కినేని 


           అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌ రెండవ చిత్రం హలో. ఈ చిత్రం డిసెంబరు 22, 2017న విడుదల అయ్యింది. తన తొలి చిత్రం పరాజయం కావడంతో తదుపరి చిత్రం ఎలాగైన విజయం సాధించాలన్న ఉద్దేశ్యంతో ఎన్నో కథలను విన్న అఖిల్‌ హలోను ఎంపిక చేసుకున్నాడు. నాగార్జున నిర్మాతగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు, అభిమానుల నుంచి మొదటి నుంచి మంచి పేరు తెచ్చుకున్నారు. 
కథ విషయానికి వస్తే శీను (అఖిల్‌) ఒక అనాథ. చిన్నప్పటి స్నేహితురాలు జున్ను (కళ్యాణి ప్రియదర్శిన్‌) ను ఇష్టపడతాడు. జున్ను కూడా శీను అంటే అంతే ఇష్టపడుతుంది. శీను సంగీతం అంటే జున్నుకి ఎంతో ఇష్టం. అయితే అనుకోని పరిస్థితుల్లో జున్ను కుటుంబం ఢిల్లీ వెళ్ళిపోతుంది. ఇలా వెళుతున్న జున్ను శీనుకు తన ఫోన్‌ నెంబరు ఇచ్చి ఫోన్‌ చెయ్యమంటుంది. అయితే కథానాయకుడు శీను ఆ ఫోన్‌ నెంబరు పోగొట్టుకుంటాడు. 15 ఏళ్ళ తరువాత జున్ను కుటుంబం ఢిల్లీ నుంచి అమెరికా వెళ్ళిపోదామనుకుంటుంది. జున్ను ఎలాగైన శీనును కలవాలనే ఉద్దేశ్యంతో తల్లిదండ్రులను ఒప్పించి హైదరాబాదు వస్తుంది. హైదరాబాదు వచ్చిన జున్ను శీనను ఎలా కలిసింది. కథానాయికని కలుసుకోవడానికి శీను చేసిన ప్రయత్నాలు, చివరికి వాళిద్దరూ ఎలా కలిసారు అన్నదే కథ. 
సినిమా ప్రధానంగా ఆహ్లాదకరంగా మొదలు పెట్టడం ఈ చిత్రానికి ప్లెస్‌ పాయింట్‌. డ్యాన్స్‌ విషయానికి వస్తే హీరో తేలికపాటి మూమెంట్స్‌ వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పేరు పెట్టడానికి వీలు లేని విధంగా తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం ఈ చిత్రానికి మరొక పెద్ద ప్లస్‌ పాయింట్‌. చిత్రం ఆరంబం నుంచి చివరి వరకు నేపథ్య సంగీతం బాగా కుదిరాయి. దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ హీతో పాత్రని పెద్ద హడావిడి లేకుండా ప్రశాతంగా నడిపిస్తూ మంచి ఫ్యామిలీ ఎమోషనల్‌తో చిత్ర నిర్మాణం జరిగింది. కొన్ని సన్నివేశాల్లో రమ్యకృష్ణ, జగపతిబాబుల నటనతో కళ్ళు చమర్చాయి. హీరో అఖిల్‌ సినిమాకు ఎంత న్యాయం చేయాలో అంతకన్నా ఎక్కువే చేశాడు. 
దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ సాధరణ కథనే తీసుకున్నా దానికి మసాలాను దట్టించి సినిమాను బాగా నడిపించారు. కథానాయకుల మధ్య కొన్ని సన్నివేసాలు మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారు. ప్రవీణ్‌ పూడి చిత్రాన్ని బాగానే ఎడిటింగ్‌ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మాణ విలువలు సినీ తెరపై ప్రతీచోటా కనిపిస్తూనే ఉన్నాయి. మొత్తానికి హలో సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేస్తుందనే చెప్పాలి. 



No comments:

Post a Comment