Showing posts with label mca movie review. Show all posts
Showing posts with label mca movie review. Show all posts

Thursday, 21 December 2017

mca movie review

ఎంసిఎ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి చిత్ర సమీక్ష 

           వరుస విజయాలతో ప్రేక్షకుల గుండెల్లో చెరగుని ముద్ర వేసుకున్న నాని ఎంసిఎ మిడల్‌ క్లాస్‌ అబ్బాయి అనే పేరుతో మరోసారి తెరమీదకు వచ్చారు. ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. అయితే ఈ కథలో కథానాయకుడు నాని (నాని)కి తన అన్న (రాజీవ్‌ కనకాల) అంటే బాగా ఇష్టం. అయితే అన్నకు పెళ్ళి అయిన తరువాత వాళ్ళ మధ్య దూరం పెరుగుతుంది. దాంతో వదిన జ్యోతి( భూమిక)పై అయిష్టత పెంచుకుంటాడు నాని. అదే సమయంలో పల్లవి (పల్లవి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ప్రభుత్వ కార్యాలయంలో పని చేస్తున్న వదిన జ్యోతికి తన విధులు నిర్వర్తించే విషయంలో ఒక రౌడీ వరంగల్‌ శివతో ఘర్షణ మొదలవుతుంది. దాంతో శివ జ్యోతిని చంపాలని ప్రయత్నిస్తాడు. దానికి కథానాయకుడు నాని అడ్డుపడతాడు. ఇలా గొడవ పెద్దదై శివ నాని వదినను చంపుతానంటూ ఛాలెంజ్‌ చేస్తాడు. ఒక సాదా సీదా మిడిల్‌ క్లాస్‌ కుర్రాడైన నాని శివ నుండి వదినను ఎలా కాపాడుకున్నాడు ? శివను ఏం చేశాడు ? అనేదే సినిమా. 
        మిడిల్‌ క్లాస్‌ కుర్రాడిలా నాని నటన చాలా బాగుంది. ఈ చిత్రానికి ప్రధాన పాత్ర పోషించిన నాని సినిమా బోర్‌ కొట్టకుండా తన నేచ్యురల్‌ ఫెర్మామెన్స్‌తో నిలబెట్టే ప్రయత్నం చేసి చాలా చోట్ల సక్సెస్‌ అయ్యాడు. చిత్రం మొదటిలో నాని, అతని మిడిల్‌ క్లాస్‌ జీవితం తాలూకు సీన్లు, వదినకి అతనికి మధ్య నడిచే చిన్నపాటి మనస్పర్ధను బయటపెట్టే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో నాని, సాయి పల్లవిల ప్రేమాయణం కూడా కొంత సరదాగా సాగుతూ అలరించింది. నాని, సాయి పల్లవి కలిసి కనిపించే సన్నివేశాలు అందంగా కనిపిస్తూ కొంత ఆహ్లాదాన్నిచ్చాయి. 
       భాధ్యతగల వదినగా భూమిక తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ఇక చివరి 15 నిముషాల్లో నాని తన వదినను కాపాడుకునే విధానం బాగుంది.  చిత్రంలో విలన్‌ పాత్ర పోషించిన విజయ్‌ తన పాత్రకు న్యాయం చేశారు. చాలా సినిమాల్లో చూసినట్టే మధ్యతరగతికి చెందిన కుర్రాడు ఖాళీగా ఉంటూ తన వాళ్ళకు ఆపద వస్తే దైర్యంగా హీరోలా మారిపోతాడు. ఈ విషయాన్ని చిత్రం ప్రారంభంలో నాని తన నటనతో కొంత ఆసక్తికరంగానే లాగినా ఆ తర్వాత కథనంలో బలహీనత బయటపడటంతో ప్రేక్షకులు కొంత నిరుత్సాహ పడ్డారు. ఇంటర్వెల్‌కు అసలు కథ తెలిసిపోవడంతో తరువాత ఏం జరుతుందనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో కనబడలేదు. 
         ఇక మధ్యలో వచ్చే పాటలైతే ఎక్కడికక్కడ అడ్డుతగులుతున్నట్టే అనిపించాయి. అసలిది దేవిశ్రీ సంగీతమేనా అనిపిస్తుంది. సినిమా ముగిశాక ఒక్కటంటే ఒక్క పాట కూడా గుర్తుకురాదు. 
దేవి శ్రీ నుండి ఆశించిన స్థాయి సంగీతం ఈ సినిమాలో దొరకలేదు. ప్రవీణ్‌ పూడి ఎడిటింగ్‌ పర్వాలేదు. సమీర్‌ రెడ్డి బాగానే ఉంది. పాటల చిత్రీకరణలో అందం కనబడింది. దిల్‌ రాజు నిర్మాణ విలువలు ఎప్పటిలాగానే మంచి స్థాయిలో ఉన్నాయి. మొత్తానికి ఈ 'మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి' సినిమా రొటీన్‌ కమర్షియల్‌ ఎంటర్టైన్‌మెంట్‌ అని చెప్పొచ్చు. ముఖ్య తారాగణం నటన బాగుండగా చాలా సినిమాల్లో చూసిన పాత కథ, కొత్తగా అనిపించని, ఊహించదగిన సన్నివేశాలు, ఆసక్తిని కలిగించలేకపోయిన కథనం, దేవి శ్రీ సంగీతం అంచనాలను అందుకోలేకపోవడం వంటి అంశాలు బలహీనతలుగా నిలిచి సినిమాను జస్ట్‌ యావరేజ్‌ స్థాయిలో నిలబెట్టాయి. 

ఎంసిఎ మిడల్‌ క్లాస్‌ అబ్బాయి డిసెంబర్‌ 21, 2017 న విడుదల అయ్యింది. ఈ చిత్రంలో నాని, సాయి పల్లవి, భూమిక లు ప్రధాన పాత్ర పోషించారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించారు. నిర్మాతలుగా దిల్‌ రాజు, శిరీష్‌ , లక్ష్మణ్‌ ఉన్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం స్వరపరచగా సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, ప్రవీణ్‌పూడి ఎడిటర్‌గా ఉన్నారు.