వేసవి కాలం మొదలైంది కదా. బయటకు వెళ్ళి వచ్చేసరికి మీ ముఖం అలసిపోయి
మొటిమలురావడం, నల్లబడిపోవడం వంటివి జరుగుతాయి కదండి. వాటిని
పరిష్కరించేందుకు చక్కటి పరిష్కార మార్గాలు చూద్దామ మరి. మీరు బయటకు వెళ్ళే
ముందు గందం పొడిని ముఖానికి రాసుకుంటే ఎండ ప్రభావం అంతగా ఉండదు. దాంతో
పాటు మొటిమలు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. అలాగే ముల్తానా మట్టిలో
చల్లటి నీటిని కలిపి ఫేస్‌ప్యాక్‌లా వేసుకుని ఒక గంట తరువాత చల్లటి నీటితో
వాష్ చేసుకుంటే వాడిపోయిన ముఖం మళ్ళీ కాంతివంతంగా మారుతుంది. అలాగే
గ్లాసుడు నీటిలో చిన్న అల్లం ముక్క వేసి బాగా మరిగించి చల్లార్చిన తరువాత
ఒక మెత్తని గుడ్డతో ముఖం తుడుచుకోవాలి. ఇలా వీలైనప్పుడల్లా చేస్తే ముఖం
తాజాగా కనిపిస్తుంది.
Thursday, 22 March 2018
Wednesday, 21 March 2018
స్వాగతం
ఈ-వాల్ పోస్టర్ ద్వార వివిధ అంశాలపై అంతర్జాల వీక్షకులకు, సాహిత్యాభిమానులకు ఆకర్షనీయంగా, పసందుగా అందిస్తుంది, ఆరోగ్యం, వినోదం , క్రీడలు , పర్యావరణం ఇంకా ఎన్నో అంశాలను, ఆసక్తికరమై విషయాలను అంధించేదుకు ఈ-వాల్ పోస్టర్ పేరుతో మీ ముందుకు వస్తున్నాం. మమ్మల్ని ఆధరిస్తారని ఆశిస్తున్నాం.
Subscribe to:
Posts (Atom)